మీ బ్లాగ్ కొరకు టెంప్లేట్‌ను ఎంచుకునే పుట బ్రౌజర్‌లో ప్రదర్శించబడి వున్నప్పుడు, మీ బ్రౌజర్ యొక్క చిరునామా పట్టిని గమనించండి. పైన యివ్వబడిన వెబ్ చిరునామా లాంటిది కనపడుతుంది.
?blogID = తరువాత వున్న సంఖ్య మీ బ్లాగ్ ను గుర్తించడం కోసం బ్లాగర్.కామ్ కేటాయించిన నిర్దిష్ట సంఖ్య. బ్లాగర్.కామ్ ప్రోగ్రామ్ మీ బ్లాగ్‌ను గుర్తించడానికి ఈ సంఖ్యనే వుపయోగిస్తుంది. ఆ కారణంగానే మీ బ్లాగ్ యెక్క చిరునామా, శీర్షిక ఎప్పుడంటే అప్పుడు మార్చుకునే వీలు కలుగుతుంది
ఈ సంఖ్యను మీరు గుర్తుంచుకోనక్కరలేదు. మీరు మీ బ్లాగ్‌ను దాని యొక్క వెబ్ చిరునామా (URL) తో, మీ బ్లాగ్‌లో ఏమి రాశారు అనే విషయాన్ని మీ బ్లాగ్ శీర్షికతోనే గుర్తిస్తారు.

No comments:
Post a Comment