మాదిరి పేరు ప్రక్కన వున్న చిన్న వృత్తాన్ని రేడియో/ఆప్షన్ బొత్తం అంటారు. ఉన్న వాటిట్లోనుంచి ఏదో ఒక్కటి మాత్రమే ఎంచుకోగలిగే లక్షణం కలిగిన ఐచ్ఛికలకు రేడియో బొత్తాలు వాడతారు. [ఉదా: మీ బ్లాగ్‌కు ఒకసారి ఒక్క మాదిరినే ఎంచుకోగలుగుతారు కదా !!]. ఒక్కో ఐచ్ఛికానికి ఒక రేడియో బొత్తం జోడించబడి వుంటుంది. ఎంచుకోబడిన ఐచ్ఛికకు సంబందించిన బొత్తం, మధ్యలో నల్లటి చుక్క కలిగివుంటుంది.
అనేక బ్యాండ్లు [MW (Medium Wave), SW1 (Short Wave1), SW2, SW3, .. ] వున్న రేడియోలలో, బ్యాండ్ ఎంచుకోవడానికి ఒక్కొక్క బ్యాండ్‌కు ఒక బొత్తం వుంటుంది.
ఎంచుకోబడ్డ బ్యాండ్‌ను సూచిస్తూ దానికి సంబంధించిన బొత్తం నొక్కిపెట్టబడి వుంటుంది. వేరే బ్యాండ్‌ను ఎంచుకోవడానికి సంబంధిత బొత్తం నొక్కగానే ఇంతకు ముందు నొక్కి పెట్టబడివున్న బొత్తం రిలీస్ అవుతుంది. ఒకేసారి రెండు బొత్తాలు నొక్కిపెట్టి వుంచడం సాధ్యపడదు.
అదే లక్షణం కలిగి వుంటుంది కాబట్టి దీనిని కూడా రేడియో బొత్తం అన్నారు.

No comments:
Post a Comment