Friday, December 18, 2009

Thursday, December 17, 2009

Saturday, November 21, 2009

పోస్ట్ శీర్షిక

లంకె క్షేత్ర ప్రదర్శన సశక్త పరచబడి వున్నప్పుడు, ఆ క్షేత్రమును ఖాళీగా వదిలేసినట్లయితే, పోస్ట్ శీర్షిక, పోస్ట్ పుటకు లంకెగా పనిచేస్తుంది. ఆ లంకె మీద క్లిక్ చేసినట్లయితే కేవలం ఆ పోస్ట్ మాత్రమే కలిగివున్న బ్లాగ్ పుట ప్రదర్శించబడుతుంది [బ్లాగర్ అమరికలలో పోస్ట్ పుటల అమరిక సశక్త పరచబడి వున్నట్లయితే]లంకె క్షేత్ర ప్రదర్శన సశక్త పరచబడి వున్నప్పుడు, ఆ క్షేత్రమును ఖాళీగా వదిలేసినట్లయితే, పోస్ట్ శీర్షిక, పోస్ట్ పుటకు లంకెగా పనిచేస్తుంది. ఆ లంకె మీద క్లిక్ చేసినట్లయితే కేవలం ఆ పోస్ట్ మాత్రమే కలిగివున్న బ్లాగ్ పుట ప్రదర్శించబడుతుంది [బ్లాగర్ అమరికలలో పోస్ట్ పుటల అమరిక సశక్త పరచబడి వున్నట్లయితే]లంకె క్షేత్ర ప్రదర్శన సశక్త పరచబడి వున్నప్పుడు, ఆ క్షేత్రమును ఖాళీగా వదిలేసినట్లయితే, పోస్ట్ శీర్షిక, పోస్ట్ పుటకు లంకెగా పనిచేస్తుంది. ఆ లంకె మీద క్లిక్ చేసినట్లయితే కేవలం ఆ పోస్ట్ మాత్రమే కలిగివున్న బ్లాగ్ పుట ప్రదర్శించబడుతుంది [బ్లాగర్ అమరికలలో పోస్ట్ పుటల అమరిక సశక్త పరచబడి వున్నట్లయితే]

Monday, November 02, 2009

Tuesday, October 27, 2009

రేడియో

మాదిరి పేరు ప్రక్కన వున్న చిన్న వృత్తాన్ని రేడియో/ఆప్షన్ బొత్తం అంటారు. ఉన్న వాటిట్లోనుంచి ఏదో ఒక్కటి మాత్రమే ఎంచుకోగలిగే లక్షణం కలిగిన ఐచ్ఛికలకు రేడియో బొత్తాలు వాడతారు. [ఉదా: మీ బ్లాగ్‌కు ఒకసారి ఒక్క మాదిరి‌నే ఎంచుకోగలుగుతారు కదా !!]. ఒక్కో ఐచ్ఛికానికి ఒక రేడియో బొత్తం జోడించబడి వుంటుంది. ఎంచుకోబడిన ఐచ్ఛికకు సంబందించిన బొత్తం, మధ్యలో నల్లటి చుక్క కలిగివుంటుంది.
అనేక బ్యాండ్లు [MW (Medium Wave), SW1 (Short Wave1), SW2, SW3, .. ] వున్న రేడియోలలో, బ్యాండ్ ఎంచుకోవడానికి ఒక్కొక్క బ్యాండ్‌కు ఒక బొత్తం వుంటుంది.

ఎంచుకోబడ్డ బ్యాండ్‌ను సూచిస్తూ దానికి సంబంధించిన బొత్తం నొక్కిపెట్టబడి వుంటుంది. వేరే బ్యాండ్‌ను ఎంచుకోవడానికి సంబంధిత బొత్తం నొక్కగానే ఇంతకు ముందు నొక్కి పెట్టబడివున్న బొత్తం రిలీస్ అవుతుంది. ఒకేసారి రెండు బొత్తాలు నొక్కిపెట్టి వుంచడం సాధ్యపడదు.

అదే లక్షణం కలిగి వుంటుంది కాబట్టి దీనిని కూడా రేడియో బొత్తం అన్నారు.

బ్లాగర్.కామ్ వెబ్‌ సైట్‌

మీ బ్లాగ్ కొరకు టెంప్లేట్‌ను ఎంచుకునే పుట బ్రౌజర్‌లో ప్రదర్శించబడి వున్నప్పుడు, మీ బ్రౌజర్ యొక్క చిరునామా పట్టిని గమనించండి. పైన యివ్వబడిన వెబ్ చిరునామా లాంటిది కనపడుతుంది.

post-create.g అనేది ఒక ఫైల్ పేరు. ఇది మీకు టెంప్లేట్ ఏంచుకోవడానికి వుపయోగపడే ప్రోగ్రామ్ కోడ్ కలిగి వున్న బ్లాగర్.కామ్ వెబ్‌ సైట్‌లోని ఒక వెబ్ పుట.

?blogID = తరువాత వున్న సంఖ్య మీ బ్లాగ్ ను గుర్తించడం కోసం బ్లాగర్.కామ్ కేటాయించిన నిర్దిష్ట సంఖ్య. బ్లాగర్.కామ్ ప్రోగ్రామ్ మీ బ్లాగ్​ను గుర్తించడానికి ఈ సంఖ్యనే వుపయోగిస్తుంది. ఆ కారణంగానే మీ బ్లాగ్ యెక్క చిరునామా, శీర్షిక ఎప్పుడంటే అప్పుడు మార్చుకునే వీలు కలుగుతుంది

ఈ సంఖ్యను మీరు గుర్తుంచుకోనక్కరలేదు. మీరు మీ బ్లాగ్‌ను దాని యొక్క వెబ్ చిరునామా (URL) తో, మీ బ్లాగ్‌లో ఏమి రాశారు అనే విషయాన్ని మీ బ్లాగ్ శీర్షికతోనే గుర్తిస్తారు.

Saturday, October 24, 2009

ప్రత్యామ్నాయం

బ్లాగ్​ను తొలగించడమంటే, ఆ బ్లాగ్​లో వున్న మొత్తం పాఠాన్ని తొలగించడమే. బ్లాగ్ పుట, పోస్ట్​లు, వ్యాఖ్యలు, వెనుకకు లంకెలు, సభ్యులకు అనుమతులు మొదలగునవి. అయితే మీరు మీ బ్లాగ్​కు ఉన్నతస్థాయి ఎఫ్​టిపి ఐచ్ఛికలు వుపయోగించి మీ సొంత వెబ్ సర్వర్ మీద ఆతిధ్యమిచ్చి వుంటే, ఆ వెబ్ సర్వర్​లోకి అప్పటికే ఎక్కించి భద్రపరచబడ్డ పాఠం మాత్రం తొలగించబడదు.

బ్లాగర్​లో బ్లాగ్ పోస్ట్ సృష్ఠించే పుట నుండి ఎక్కించిన ప్రతిమలు, విడియోలు, ఏ బ్లాగ్​లో నయినా వుపయోగించుకోదగిన లక్షణం కలిగి వుంటాయి. ప్రతిమలు ప్రస్తుతము వినియోగములో వున్న photos.blogger.com లాంటి సైట్ లోకి, విడియోలు videos.google.com లోకి ఎక్కించబడతాయి. కాబట్తి, ఇప్పుడు మీరు తొలగిస్తున్న బ్లాగ్​లో మీరు వినియోగించిన ప్రతిమలు, విడియోలు వేరే ఎక్కడన్నా వినియోగించదలచినట్లయితే అవసరమైనప్పుడు అందుబాటులో వుండే విధంగా సంబధిత యూఆర్​ఎల్​లు అన్నీ పోగు చేసి భద్రపరచుకోవలసి వుంటుంది. బ్లాగ్ ఫీడ్​లు ఆ యూఆర్​ఎల్​లు పోగు చేసుకోవడానికి వుపయోగపడతాయి